కరోనా వైరస్ నివారణకు కృషి చేస్తున్న పోలీసులకు తూర్పుగోదావరి జిల్లా తునిలో వ్యాపారి ముద్దుల రామారావు గొడుగులు, మాస్క్లు అందించారు. సీఐ రమేష్ బాబుకు వైకాపా నేత ఏలూరి బాలు చేతుల మీదుగా రామారావు వీటిని అందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసుల సేవలు చాలా గొప్పవని రామారావు అన్నారు. ఎండలో సేవలందిస్తున్న పోలీసులకు గొడుగులు బాగా ఉపయోగపడతాయన్నారు.
పోలీసులకు గొడుగులు బహుమతి..! - తునిలో పోలీసులకు గొడుగుల పంపిణీ
తూర్పుగోదావరి జిల్లా తునిలో పోలీసులకు ఓ వ్యాపారి గొడుగులు, మాస్క్లు అందించారు. కరోనా నివారణకు ఎండలో పనిచేస్తున్న పోలీసులకు గొడుగులు ఎంతో ఉపయోగపడతాయని దాత ముద్దుల రామారావు అభిప్రాయపడ్డారు.

తునిలో పోలీసులకు గొడుగుల పంపిణీ