కరోనా మహమ్మారి కారణంగా కొన్ని నెలలుగా ఆలయాలు మూత పడి ఉండటంతో వాటిపై ఆధారపడి జీవనం సాగించే పురోహితులు, వేదపండితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి కష్టాలను గుర్తించిన ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, అజెమా జెహెర్మ సేవా సంస్థలు తూర్పుగోదావరి పిఠాపురం సమీపంలోని పురోహితులు, వేద పండితులకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సుమారు వంద మందికి చొప్పున ఒక్కొక్కరికి.. ఇరవై కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు.
పురోహితులు, వేదపండితులకు .. నిత్యావసరాల పంపిణీ
కరోనాతో ఆలయాలు మూతపడ్డాయి. వేదపండితులు, పురోహితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూటగడవడమే కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్, అజెమా జెహెర్మ ట్రస్టులు మానవత్వం చాటుకున్నాయి. కొవిడ్ వేళ పురోహితులకు, వేద పండితులకు ఆపన్నహస్తం అందించాయి. నిత్యావసరాలు అందించి మానవత్వం చాటుకున్నాయి.
విశ్వవిద్యా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ఆన్ లైన్ ద్వారా ప్రసంగించారు. ఆలయాల నిర్వహణ లేకపోవడంతో వాటిపై ఆధారపడి జీవనం సాగించే పురోహితులు తీవ్రకష్టాలు ఎదుర్కొంటున్నారని, దైవస్వరూపులుగా భావించే వీరు ఎవరిని నోరు తెరిచి సాయం కోరలేరని ఆయన అన్నారు. వారి సమస్యను దృష్టిలో తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఉమర్ ఆలీషా సోదరుడు ఆలీషా చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. పురోహితులు, పండితులు ఉమర్ ఆలీషా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో మిగిలిన వారికి కూడా సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:Corona effect: ఈ ఇద్దరి కష్టం.. ఇంకెవరికీ రాకూడదు!