గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతు
తూర్పుగోదావరి జిల్లా బడుగువానిలంక వద్ద గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
గోదవరిలో ఇద్దరు యవకులు గల్లంతు
తూర్పుగోదావరి జిల్లా వీరవరం గ్రామానికి చెందిన పలువురు కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు గోదావరి వద్దకు వెళ్లారు. ఈత కోసం వెళ్ళిన ఇద్దరు యువకులు నీటిలో పడి గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.