Two young men died: తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ముక్తేశ్వరంలో శివరాత్రి సందర్భంగా ముగ్గురు యువకులు.. తుల్యభాగ నది కాలువలో పుణ్య స్నానం ఆచరించడానికి వెళ్లి గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. కొన ఊపిరితో ఉన్న యశ్వంత్(20) అనే మరో యువకుడిని గుర్తించిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యశ్వంత్ మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పెదపూడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Two young men died: పుణ్యస్నానానికి వెళ్లి... పరలోకానికి చేరారు.. - మక్తేశ్వరంలో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి
Two young men died: పెదపూడి మండలం ముక్తేశ్వరంలోని తుల్యభాగ నది కాలువలో పుణ్య స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాలువలో పుణ్యస్నానానికి వెళ్లి మృతి