ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మట్టి పెళ్లలు విరిగిపడి బావిలో ఇద్దరు కూలీలు మృతి - two workers died in well in kakinada

కాకినాడ ద్వారకానగర్‌ లో విషాదం చోటుచేసుకుంది. పురాతన బావిని తవ్వుతుండగా మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతిచెందారు.

'బావిలో మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతి'

By

Published : Sep 13, 2019, 10:40 PM IST

'బావిలో మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతి'

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దుర్ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ద్వారకానగర్‌ రైల్వేగేటు సమీపంలోని ఓ ఇంట్లో పాత బావిని పూడ్చుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మరణించారు. ఇంటి యజమాని పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. 2 గంటలు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. కుటుంబ సభ్యులు విలపించిన తీరు అందరినీ కలిచివేసింది. నిరుపేదలైన కూలీల కుటుంబ సభ్యులను ఆదుకోవాలని బంధువులు డిమాండ్​ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details