ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిర్లక్ష్యం విలువ రెండు ప్రాణాలు! - trained collided two women news

తమ గమ్య స్థానానికి తక్కువ దూరం అని చూసుకున్నారే గానీ.. ప్రమాదం పొంచి ఉందని పసిగట్టలేకపోయారు. రైలు వస్తే.. తమ పరిస్థితి ఏంటని ఆలోచించి ఉంటే.. రెండు ప్రాణాలు గాల్లో కలిసి ఉండేవి కాదు.

two ladies died
రైలు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి

By

Published : Feb 17, 2021, 11:57 AM IST

తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలోని.. రైల్వే వంతెనపై రైలు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య, చెల్లెలుతో కలిసి.. విశాఖ నుంచి తునికి రైలులో వచ్చారు. తుని పక్కనే ఉన్న పాయకరావుపేట లింగాల కాలనీలో వీరికి ఇల్లు ఉంది. ఇంటికి వెళ్లేందుకు దగ్గరని.. రైలు వంతెన పై నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సూపర్ ఫాస్ట్ రైలు వీరిని ఢీకొట్టటంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులు మత్యం, సూర్యాకాంతంగా గుర్తించారు. మత్యం భర్త ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మృతదేహాలు ఛిద్రం కాగా.. ఓ మృతదేహం తాండవ నదిలో పడింది.

ABOUT THE AUTHOR

...view details