ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవాక్కయిన జనం.... విచారణ చేస్తామన్న పోలీసులు... - ఆంధ్రప్రదేశ్ వార్తలు

రవాణాశాఖ కళ్లు కప్పి వాహనానికి వేరు వేరు నెంబర్ ప్లేట్లు మారుస్తు ట్రాఫిక్ చాలన్లు తప్పించకునేందుకు చాల మంది ప్రయత్నిస్తుంటారు. కానీ ఒకే నంబర్ ప్లేటుతో రెండు వాహనాలను నడుపుతూ అది పక్క పక్కనే వెళ్లడం మీరు ఎప్పుడైనా చూశారా? అలాంటి సంఘటనే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది. అది చూసి వెనుక వచ్చే వాహనదారులు ఆశ్చర్యపోయారు.

Two Vehicles One Number
అవాక్కయిన జనం.... విచారణ చేస్తామన్న పోలీసులు...

By

Published : Jul 30, 2021, 3:23 PM IST

రవాణాశాఖ నిబంధనల ప్రకారం ఒక వాహనానికి ఒక నంబరు ఒక మాత్రమే ఉండాలి. కాని రాజమహేంద్రవరంలో ఒకే నంబర్ ప్లేటుతో రెండు వాహనాలను నడుపుతూ అది పక్క పక్కనే వెళ్లడం వెనుక వచ్చే వాహనదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. రెండు ద్విచక్ర వాహనాలకూ ఒకే నంబరు ఉండడంతో ఇన్‌ఛార్జ్​ ప్రాంతీయ రవాణాశాఖాధికారి రంగనాయకులుకు సమాచారం ఇవ్వగా ఒకే నంబరుతో రెండు వాహనాలు నడపడం నేరమని, వాహనం రిజిస్ట్రేషన్‌ వివరాల ఆధారంగా విచారణ చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details