తూర్పుగోదావరిజిల్లా సఖినేటిపల్లి మండలం మోరి జడ్పీ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. తొలుత పాఠశాలలో ఓ విద్యార్థికి కరోనా సోకింది. దీంతో లక్షణాలున్న వారికి శనివారం.. పరీక్షలు నిర్వహించగా ఇద్దరు ఉపాధ్యాయులు, ఎనిమిది మంది పదొ తరగతి విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు మోరి పీహెచ్ సీ వైద్యాధికారి ప్రతిమ తెలిపారు. సహచర విద్యార్థులు, అధ్యాపకులకు కలిపి మరో 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారి తెలిపారు. తరగతి గదులు శానిటేషన్ చేసి తాత్కాలికంగా నిలిపివేశారు.
Govt School: 8 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా - కరోనా వార్తలు
తూర్పుగోదావరిజిల్లా సఖినేటిపల్లి మండలం మోరి జడ్పీ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఇద్దరు ఉపాధ్యాయులు, ఎనిమిది మంది పదోతరగతి విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.
కరోనా