ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అందాల లోగిలి.. మృత్యు కౌగిలి - పిఠాపురం కాలువలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు వార్తలు

ఆదివారమని సరదాగా ఐదుగురు విద్యార్థులు కాలువ దగ్గరికి వెళ్లారు. అందరూ కలిసి సెల్ఫీ తీసుకుంటుంగా..ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి కాలువలో పడ్డాడు. స్నేహితుడిని కాపడటానికి మరో విద్యార్థి నీళ్లలోకి దిగాడు. నీటి ఉద్ధృతి ఎక్కువ ఉండటంతో.. ఆ ఇద్దరూ గల్లంతై మరణించారు. వారి మృతితో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ఇరుకుటుంబాల్లో విషాదం నెలకొంది.

two students  died at peetapuram
పిఠాపురంలో ఇద్దరు విద్యార్థులు మృతి

By

Published : Mar 1, 2021, 12:56 PM IST

విద్యార్థుల సెల్ఫీ సరదా యమపాశమై ఇద్దరి ప్రాణాలు తీసింది. ఆ రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్నంలోని భారతి పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఆదివారం సరదాగా సెల్పీ దిగేందుకు గొల్లప్రోలు సమీపంలో ఏలేరు కాలువ వద్దకు వెళ్లారు. కాలువ వద్దనున్న వంతెన పై సెల్ఫీ తీసుకుంటుండగా వీరిలో తేజ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు కాలువలో జారిపడ్డాడు. గమనించిన వాసు అనే విద్యార్థి అతడిని రక్షించేందుకు కాలవలోకి దిగాడు. కాలువలో ఉద్ధృతంగా నీరు ప్రవహించడంతో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు.

ఒడ్డునున్న మిగతా ముగ్గురు.. స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించగా... వారు సంఘటనా ప్రాంతానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు నాలుగు గంటలకు పైగా ముమ్మరంగా గాలించిన తర్వాత... రాత్రి 9 గంటల సమయంలో మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఇదీ చూడండి:

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల దాడులు.. గుట్కా, సారా, మద్యం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details