ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుండెపోటుతో ఇద్దరు మృతి.. రెండు వేర్వేరు పోలింగ్​ కేంద్రాల్లో ఘటన - komarada latest news

తూర్పు గోదావరి జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో గుండెపోటుతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాలకు వెళ్లి.. అక్కడే కుప్పకూలి పోయారు.

two persons died
గుండెపోటుతో ఇద్దరు మృతి

By

Published : Feb 21, 2021, 2:50 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో తుది దశ పంచాయతీ ఎన్నికల్లో విషాదం జరిగింది. కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలో 85 ఏళ్ల దంగేటి నాగూరు.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రానికి వెళ్లారు. ఓటు వేసేందుకు లోనికి వెళ్లగానే కుప్పకూలి పడిపోయారు.

వెంటనే స్పందించి.. ప్రాథమిక చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గుండెపోటుతో చనిపోయినట్టు వైద్యులు తేల్చారు. మామిడికుదురు మండలం కొమరాడలో కొండయ్య (63) ఓటు వేసిన అనంతరం అకస్మాత్తుగా మరణించాడు. అతని మృతికి గుండెపోటు కారణమని వైద్యులు నిర్థరించారు.

ABOUT THE AUTHOR

...view details