తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో ఇద్దరు గుర్తు తెలియని యువతుల మృతదేహాలు కొట్టుకొచ్చిన ఘటన కలకలం రేపింది. గోదావరి గట్టు ఇసుక ర్యాంపు వద్ద కొట్టుకొచ్చిన మృతదేహాలను చూసి జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు. వన్ టౌన్ పోలీసులు యువతుల మృతదేహాల్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి వయస్సు 20 నుంచి 25 మధ్య ఉండొచ్చని తెలిపిన పోలీసులు.. ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేదా ఎవరైనా హతమార్చి గోదావరిలో పడేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
గోదావరిలో ఇద్దరు యువతుల మృతదేహాలు.. హత్యా? ఆత్మహత్యా?! - godavari two girls died news
రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో ఇద్దరు గుర్తు తెలియని యువతుల మృతదేహాలు కొట్టుకొచ్చాయి. జాలర్లు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఎవరైనా హత్య చేసి గోదావరిలో పడేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
girls died in godavari