Two People died: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వద్ద పరమేశ్వర బయోటెక్ మొక్కజొన్న పరిశ్రమలో బాయిలర్ శుభ్రం చేస్తుండగా తీవ్ర అస్వస్థకు గురై... సూపర్ వైజర్, మరో కార్మికుడు మృతి చెందారు. తెల్లవారుజామున బాయిలర్ శుభ్రం చేసేందుకు కార్మికుడు బీరువాదాం లోపలికి దిగాడు. ఊపిరాడక తీవ్ర అస్వస్థకు గురవ్వడంతో... మరో కార్మికుడు అనిసింగ్ కూడా లోపలకు దిగాడు. ఇద్దరిని రక్షించే ప్రయత్నంలో సూపర్ వైజర్ గాజుల శ్రీనుకు కూడా ఆక్సిజన్ అందలేదు. తీవ్ర అస్వస్థకు గురైన ముగ్గురిని... మిగతా కార్మికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో శ్రీను, బీరువాదాం ఇద్దరు చనిపోయారు.
Death: బాయిలర్ శుభ్రం చేస్తుండగా తీవ్ర అస్వస్థత.. ఇద్దరు మృతి - పరిశ్రమలో బాయిలర్ శుభ్రం చేస్తూ ఇద్దరు మృతి
Two People died: మొక్కజొన్న పరిశ్రమలో బాయిలర్ శుభ్రం చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే..?

ఇద్దరు మృతి
మృతుల్లో శ్రీనుది తాళ్లపూడి మండలం తిరుగుడు మెట్ట కాగా.. బీరువాదాం ఒడిశాకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. మరో కార్మికుడికి రాజమహేంద్రవరంలో చికిత్స అందిస్తున్నారు. కొవ్వూరు ఆర్డీవో మల్లిబాబు, డీఎస్పీ త్రినాథ్, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, స్థానిక అధికారులు పరిశ్రమను సందర్శించారు. ప్రమాద వివరాలను యాజమాన్ని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున పరిహారం అందిచేందుకు యాజమాన్యంతో ఒప్పించామని ఎమ్మెల్యే వెంకట్రావు చెప్పారు.
ఇవీ చదవండి: