తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక శివారు పిచ్చుకలంక బ్యారేజీ వద్ద సరదాగా స్నానాలకు వెళ్లి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహలు లభ్యమయ్యాయి. రాజమహేంద్రవరంలోని హుకుంపేటకు చెందిన నలుగురు స్నేహితులు మంగళవారం సాయంత్రం పిచ్చుకలంక వద్ద బ్యారేజీ దిగువన గోదావరిలో సాన్నానికి వెళ్లారు.
అ సమయంలో గోదావరి ఉధృతి పెరగటంతో మెండే బాబి (17), ఈతకోట చిన్న (15) గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు వీరి కోసం ఈతగాళ్లతో గాలించారు. పేరవరం గోదావరి వద్ద నేడు ఇద్దరు మృతదేహాలు లభ్యమైనట్లు ఎస్సై నరేష్ తెలిపారు.