తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం బండారులంక శివారు పందలపాడు ప్రాంతంలో.. ఇద్దరికి కరోనా సోకింది. వారి నివాస ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు.. ప్రజలు బయట తిరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ఈ ప్రాంతంలో 800 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా 300 మందికి మాత్రమే పరీక్షలు చేశామని డాక్టర్ సిహెచ్. పుష్కర రావు తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వారికి కరోనా నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. మిగిలిన వారికి కూడా పరీక్షలు పూర్తి చేస్తామన్నారు.