తూర్పు గోదావరి జిల్లా మామిళ్లగూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటి గుంటలో పడి మృతి చెందారు. పాఠశాలకు సెలవు కావటంతో ఊరి శివార్లలో ఉన్న కాలువలో కాసేపు సరదాగా చేపలు పట్టారు. అనంతరం స్నానం చేసేందుకు నీటి కుంటలో దిగి ఊపిరాడక మృతి చెందారు. వీరితో పాటు వచ్చిన మరో ఇద్దరు చిన్నారులు గ్రామస్థులకు ఈ విషయాన్ని తెలియజేయటంతో నీటిలో మునిగిపోయిన చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. చిన్నారుల మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు అందరిని కలిచివేసింది.
'నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి' - east godavari district
సేలవు రోజు కావటం ఆ చిన్నారుల పాలిట శాపమైంది. సరదాగా ఆడుకుందాం అనుకున్నారు. గ్రామం శివారులో ఉన్న కాలువలో కాసేపు చేపలు పట్టారు. అనంతరం స్నానం చేసేందుకు ఉపాధి హామీ పథకంలో తీసిన నీటి గుంటలో దిగారు. తిరిగిరాని లోకాలకు వెళ్లారు.
'నీటి కుంటలో పడి మామిళ్లగూడెంలో ఇద్దరు చిన్నారులు మృతి'