తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కొత్తపేటకు చెందిన రంకిరెడ్డి సతీష్, కరిబండి సునీల్ ద్విచ్రవాహనంపై రాజమహేంద్రవరం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చొప్పళ్ల వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ వీళ్ల బైకును బలంగా ఢీ కొట్టింది. మొక్కలకు నీరు పోస్తున్న జాతీయ రహదారి విభాగం సిబ్బంది ట్యాంకర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు.
చొప్పెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్యాంకర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు కొత్తపేటకు చెందిన వాళ్లుగా గుర్తించారు.
చొప్పెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం
ఈ ప్రమాదంలో సునీల్ అక్కడికక్కడే మృతిచెందగా... తీవ్రంగా గాయపడ్డ సతీశ్‌ను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటనా ప్రాంతాన్ని ఎస్సై శివప్రసాద్ పరిశీలించి ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
ఇదీ చూడండి:చెట్టును ఢీకొన్న కారు... ఎమ్మెల్యే రాంబాబు సన్నిహితుడు మృతి