తూర్పూ గోదావరి జిల్లా కొత్తపాకల బహిరంగ సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శలు చేశారు. బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు ఏం మాట్లాడారో తనకు అర్థం కాలేదని ... కనీసం ఆయనకైనా అర్థం అయిందో లేదో అని వ్యాఖ్యానించారు.
పవన్ మాట్లాడింది కనీసం తనకైనా అర్థమైందా..? - పవన్ దివిస్ పర్యటనపై దాడిశెట్టి రాజా విమర్శలు వార్తలు
తూర్పుగోదావరి జిల్లా కొత్తపాకలలో పవన్ పర్యటనపై తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శలు చేశారు. తెదేపా హయాంలో దివీస్ పరిశ్రమకు 500 ఎకరాలు కేటాయించినప్పుడు పవన్ సిద్ధాంతాలు ఏమయ్యాయని మండిపడ్డారు.
తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
36 మందిపై కేసు విషయంలో కేవలం మాటలకు మాత్రమే పవన్ పరిమితమయ్యాడని అన్నారు.. వారిని బెయిల్ పై విడుదల చేసే పనిలో జగన్ ప్రభుత్వం ఉందని చెప్పారు. తెదేపా హయాంలో దివీస్ పరిశ్రమకు 500 ఎకరాలు కేటాయించినప్పుడు పవన్ సిద్ధాంతాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చూడండి.సంక్రాంతి ప్రయాణికుల కోసం.. నెల్లూరు నుంచి ప్రత్యేక బస్సులు సిద్ధం