ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడలో గుడికో గోమాత.. వైవీ సుబ్బారెడ్డి గోపూజ - Gudi Ko Gomata event in Kakinada

తితిదే ఆధ్వర్యంలో జరుగుతున్న గుడికో గోమాత కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర దేవస్థానంలో గోమాతకు పూజలు చేశారు. దేశంలోని ఆలయాలు, మఠాలకు తితిదే తరుఫున గో దానం చేస్తామని చెప్పారు.

Ttd Chairman YV Subbareddy
గుడి కో గోమాత వేడుకలో పాల్గొన్న తితిదే ఛైర్మన్

By

Published : Dec 13, 2020, 10:04 AM IST

తితిదే నిర్వహిస్తున్న గుడికో గోమాత కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. కాకినాడలోని బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర దేవస్థానంలో గోమాతకు పూజలు చేశారు. దేశంలోని ఆలయాలు, మఠాలకు తితిదే తరఫున గోవులను దానంగా ఇస్తున్నామని తెలిపారు.

అలాగే బలహీన వర్గాలు, మత్స్యకార ప్రాంతాల్లో 500 ఆలయాలు నిర్మించనున్నట్లు వివరించారు. అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమల శ్రీవారిని పది రోజుల పాటు... వైకుంఠ ముఖ ద్వారం నుంచి దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ ప్రత్యేక దర్శనం కోసం భక్తులు ఆన్ లైన్ లో టిక్కెట్లు నమోదు చేసుకోవాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details