రాష్ట్రంలో తెలుగుదేశం గాలి పెనుతుపాన్లా వీస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన... రాష్ట్రంపై అందరూ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మహాభారతంలో కౌరవులు ఓడిపోయి ధర్మమే గెలిచిందని గుర్తుచేశారు. మోదీ, అమిత్‌షా రాష్ట్రాన్ని దగా చేశారని మండిపడ్డారు. ఐటీ, ఈడీ దాడులు చేస్తూ...రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు.
40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా ఒక్క కేసులేదని...జగన్‌పై మాత్రం 31 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే ప్రజల భూములు లాక్కుంటారని ఆక్షేపించారు. పోలవరం, అమరావతి తర్వాత బీచ్ రోడ్డుకు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. కాకినాడను మెగాసిటీగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు.
అండగా ఉంటే... కొండనైనా ఢీకొంటా: చంద్రబాబు - కాకినాడ
రాష్ట్రంలో తెలుగుదేశం గాలి పెను తుపాన్‌లా వీస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మోదీ, అమిత్‌షా రాష్ట్రాన్ని దగా చేశారని మండిపడ్డారు. ఐటీ, ఈడీ దాడులు చేస్తూ... రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు ఎన్నికల ప్రచారం