ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిగ్‌జాం తుపాను బీభత్సం - నీట మునిగిన వందలాది ఎకరాల వరి పంట, కన్నీరు పెడుతున్న రైతన్నలు - Cyclone Michaung causes problems for farmers in AP

Troubles of Paddy Farmers due to Cyclone Michaung : మిగ్‌జాం తుపాను అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కాకినాడ జిల్లాల రైతులను అతలాకుతలం చేసింది. వేలాది ఎకరాల వరి పంట ముంపునీటిలో ఉండిపోయింది. పంటను కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ముంపు బారిన పడిన పొలాలు ఎందుకు పనిచేయవని రైతులు మదన పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ధాన్యపురాసులు తడిసి ముద్దయ్యాయి రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Troubles_of_Paddy_Farmers_due_to_Cyclone_Michaung
Troubles_of_Paddy_Farmers_due_to_Cyclone_Michaung

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 1:04 PM IST

Troubles of Paddy Farmers due to Cyclone Michaung : అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా మిగ్‌జాం తుఫాన్‌ వరి పంటలకు తీవ్ర నష్టం తెచ్చింది. కొండ ప్రాంతాల్లో ఉంటున్న గిరజన రైతులు వరద ప్రవాహానికి విలవిలాడుతున్నారు. వందలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. తమకు తినడానికి తిండి లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. హుకుంపేట మండలం గుమ్మడి గుంట గ్రామంలో వరి కుప్పలు నీటిలో కొట్టుకుపోయాయి. పాడేరు మండలంలో మత్స్యగడ్డ ఉగ్రరూపం దాల్చడంతో ఇరుడాపల్లి, పరదానిపుట్టు మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పాడేర్‌ ఘాట్‌ రోడ్డులో కొండ చరియలు విరిగిపోతాయనే ముందస్తు రక్షణ కోసం వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

మిగ్‌జాం తుపాను బీభత్సం - నీట మునిగిన వందలాది ఎకరాల వరి పంట, కన్నీరు పెడుతున్న రైతన్నలు

పంట నీటి పాలైందని మహిళా రైతు కన్నీరు - మనసు చలించే దృశ్యం

Cyclone Michaung Problems of Konaseema District : మిగ్ జాం తుఫాను దాటికి కోనసీమ జిల్లా వరి రైతులు సర్వం కోల్పోయారు. కోత దశలో ఉన్న వరి పంట కుండపోత వానలతో నీట మునిగింది. పొలాల నుంచి నీరు కిందకి దిగిపోవడంతో వరి మెుత్తం నాని కుళ్లిపోయే దశకు వచ్చింది. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి మెుత్తం వర్షానికి కోట్టుకుపోవటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, మండలాల్లో నష్టం తీవ్రంగా ఉంది. అయినవిల్లి మండలంలో కేవలం పది శాతం మాత్రమే వరి కోతలు పూర్తయ్యాయి.

Farmers Problems due to Cyclone Michaung :కోతకు వచ్చిన పంట అంతా కళ్ల ముందే నీటిలో నానిపోతుంటే రైతులు దిగులు చెందుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వర్షపు నీటితో డ్రైయిన్లు ఉద్ధృతిగా ప్రవహిస్తున్నాయి. అయినవిల్లి మండలంలో వర్షం నీరు పొలాల నుంచి బయటకు వెళ్లటానికి కొన్ని రోజులు సమయం పడుతుందని రైతులు తెలిపారు. ఇలా నీటిలో నానిన వరి పంట చివరికి గింజ కూడా దక్కదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రెయిన్లు బాగు చేయాలని ఏళ్ల తరబడి పోరాడుతున్నా ఫలితం లేదని అంటున్నారు. ప్రకృతి విపత్తులతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు వాపోతున్నారు.

కరవు నష్టం కొండంత - ప్రభుత్వ సాయం గోరంత! 'నలిగిపోతున్న రాష్ట్ర రైతులు'

Michaung Cyclone Effect in AP : అదేవిధంగా తుపాను కారణంగా వేలాది ఎకరాల వరి పంట వర్షపు నీటిలో ఉండిపోయింది. ఈ పంటను కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ముంపు బారిన పడిన పంట ఎందుకు పనిచేయవని రైతులు మదన పడుతున్నారు. తుపాను కారణంగా నష్టాపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వర్షం వల్ల ధాన్యపు రాసులు తడిసి ముద్దయ్యాయి రంగు మారి పోయాయని రైతులు వాపోయారు. ఈ ధాన్యన్ని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Cyclone Michaung Problems in Kakinada District : తుపాను కారణంగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలు, మల్లవరం గ్రామాల మధ్య కొత్త కాలువకు గండిపడి వరి పొలాలను ముంచెత్తింది. భారీ వర్షాలతో ఇప్పటికే మునిగిన పంట తాజా నీటి ప్రవాహంతో కల్లాల్లోని ఆరబెట్టిన వరి కొట్టుకు పోయింది. ధాన్యం రాశులు పూర్తిగా నీట మునిగాయి. సుమారు 500 ఎకరాల్లో ఆరబెట్టిన ధాన్యం కొట్టుకు పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మల్లవరం గ్రామాలకు వెళ్లే రహదారిపై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రైతన్న ఇంట కన్నీరును మిగిల్చిన తుపాను - లక్షలాది ఎకరాలు వర్షార్పణం

ABOUT THE AUTHOR

...view details