భారత్, చైనాల మధ్య ఘర్షణలో వీరమరణం పొందిన అమరవీరులకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నివాళులు అర్పించారు. కోటగుమ్మం నుంచి పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైకాపా నాయకులు ఈ ర్యాలీలో పాల్గొని అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు.
వీరజవాన్లకు రాజమహేంద్రవరంలో ఘన నివాళులు - తూర్పుగోదావరి జిల్లాలో వీర జవాన్ల వార్తలు
భారత్, చైనాల మధ్య ఘర్షణలో అమరులైన సైనికులకు రాజమహేంద్రవరంలోని పలు చోట్ల వివిధ పార్టీల నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. కర్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

వీరజవాన్లకు ఘన నివాళులు అర్పించిన వివిధ పార్టీల నాయకులు
కోటగుమ్మం వద్ద కర్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి భాజపా నాయకులు నివాళులు అర్పించారు. సైనికులకు మద్దతుగా నినాదాలు చేశారు.
ఇదీ చూడండి:'జీఓ నెంబర్ 3పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి'