భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేడ్కర్ 64వ వర్ధంతిని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాంతోపాటు, నెల్సన్ మండేలా ఫ్లెక్సీకి ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అంబేడ్కర్, దక్షిణాఫ్రికా దివంగత మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా ఇద్దరు ప్రపంచంలోనే మహోన్నత వ్యక్తులు అని కొనియాడారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చిట్టిబాబు అన్నారు.