మావోయిస్టుల విధ్వంసాలు నిరసిస్తూ మన్యంలో ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని సరివేల గ్రామం వద్ద రహదారి పనులు చేస్తున్న వాహనాలను శనివారం మావోయిస్టులు దహనం చేశారు. దీంతో ఆ రహదారి పనులు నిలిచిపోయాయి. అభివృద్ధిని అడ్డుకోకుండా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని పేర్కొంటూ మావోయిస్టుల విధ్వంసాలకు నిరసనగా ఈ ర్యాలీ చేపట్టారు. అనంతరం చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణకు వినతి పత్రాన్ని అందజేశారు.
మావోయిస్టుల విధ్వంసానికి వ్యతిరేకంగా ఆదివాసీల నిరసన - visakha district tribals latest news
సరివేలు గ్రామం వద్ద మావోయిస్టులు చేసిన విధ్వంసాలు నిరసిస్తూ మన్యంలో ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా తమ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు.
Breaking News