ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చూశారా మీరు?!: చెట్టులో ఇల్లు.. ఎంత వింతగా ఉందో! - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

దీన్ని చూసి.. ఇంటిపై చెట్టు అనాలో.. చెట్టులోపల ఇల్లు అనాలో.. అర్థం కాక మీరు కాస్త తికమకపడతారు. అంతలోనే.. అరె.. బాగుందే.. అనుకుంటూ ఆ వింతను అర్థం చేసుకుని ముచ్చటపడతారు. చివరికి.. అసలు విషయం అర్థమయ్యాక.. ఆ వింతకు అబ్బురపడతారు. ఆ చెట్టేంటి.. ఇల్లేంటి.. ఆ కథేంటి?

tree over the  Pump house at Narendrapuram, east godavari district
సినిమా సెట్టుని తలపించేలా చెట్టులో ఇల్లు

By

Published : Jul 3, 2020, 5:05 PM IST

సినిమా సెట్టుని తలపించేలా చెట్టులో ఇల్లు

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం నరేంద్రపురం గ్రామంలో.. చూడముచ్చటైన వింత ఇంది. ఇక్కడ.. మూడు దశాబ్దాల క్రితం రక్షిత మంచినీటి పథకంలో భాగంగా పంపుహౌస్ ను నిర్మించారు. కాలక్రమేణా ఇది శిథిలావస్థకు చేరింది. కానీ.. ఆ పంపు హౌజ్ పక్కనే.. ఓ మర్రి చెట్టు పెరిగి పెద్దదైంది.

పంపు హౌజ్ ను పూర్తిగా చుట్టేసి.. చెట్టులోపల ఉన్న ఇంటిగా మార్చేసింది. మొదటిసారి చూసినవాళ్లతై.. ఇది చెట్టులో ఇల్లా.. ఇంటిపై పెరిగిన చెట్టా.. అన్నది అర్థం కాక.. కాసేపు అలా తికమకపడతారు. తీక్షణగా గమనించిన తర్వాత కానీ.. అసలు విషయాన్ని, అందులోని వింతను వారు అర్థం చేసుకోలేరు. నరేంద్రపురం ప్రజలకు ఇది తెలిసిన విషయమే అయినా.. ఇక్కడికి వచ్చి వెళ్లేవారికి మాత్రం కచ్చితంగా వింతే మరి.

ABOUT THE AUTHOR

...view details