తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో ఇంటిపట్టున ఉండే మహిళలకు నైపుణ్య అభివృద్ధిపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కార్యక్రమంలో కోనసీమ ప్రాంతంలో మహిళలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు.
నైపుణ్య అభివృద్ధిపై గ్రామీణ మహిళలకు శిక్షణ తరగతులు - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
అన్ని రంగాలలోను స్త్రీలు ముందంజ వేస్తున్న రోజులివి.. ఒకప్పుడయితే స్త్రీలకు వంటిల్లే చాలనుకునేవారు. వారిని చదివించి.. ఆలోచించగలిగేలా చేస్తే పురుషులతో సమానంగా అభివృద్ధిపథం వైపు పయనించగలరని గుర్తించారు. అయితే పట్టణ ప్రాంత మహిళలకే కాకుండా గ్రామీణ మహిళలకు సైతం నైపుణ్య అభివృద్ధిపై తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

నైపుణ్య అభివృద్ధిపై గ్రామీణ మహిళలకు శిక్షణ తరగతులు
పి.గన్నవరం రాజోలు నియోజకవర్గాల పరిధిలోని ఆదిమూలం వారిపాలెం రాజోలు, సఖినేటిపల్లిలో మహిళలకు 80 రోజల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇంటినుంచి ఆన్ లైన్ మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవచ్చనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి: