ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సైలెన్సర్లు ధ్వంసం.. 74 మందికి వెయ్యి చొప్పున జరిమానా - POLICE RIDES IN RAJAMAHENDRAVARAM

అధికారులు ఎంతగా జరిమానాలు విధిస్తున్నా.... కొంతమంది ఇప్పటికీ అధిక శబ్దం ఇచ్చే సైలెన్సర్లు ఉన్న వాహనాలతో రాకపోకలు చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలపై ఫిర్యాదులు పెరుగుతున్న కారణంగా.. రాజమహేంద్రవరం పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.

సైలెన్సర్లు ధ్వంసం.. 74 మందికి వెయ్యి చొప్పున జరిమానా
సైలెన్సర్లు ధ్వంసం.. 74 మందికి వెయ్యి చొప్పున జరిమానా

By

Published : Apr 1, 2021, 3:48 PM IST

Updated : Apr 1, 2021, 10:39 PM IST

రాజమహేంద్రవరంలో వాహనాల సైలెన్సర్లను ధ్వంసం చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు

రాజమహేంద్రవరంలో వాహనాల సైలెన్సర్లను ట్రాఫిక్‌ పోలీసులు ధ్వంసం చేశారు. అధిక శబ్దంతో నడుపుతున్న 74 వాహనాల సైలెన్సర్లు స్వాధీనం చేసుకున్నారు. రామాలయం జంక్షన్‌ వద్ద రోడ్డుపై పేర్చి రోలర్‌తో తొక్కించారు.

గత నెలలోనూ 50 సైలెన్సర్లను రోలర్‌తో ఇలాగే ధ్వంసం చేశారు. అధిక శబ్దంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 74 మందికి వెయ్యి రూపాయలు చొప్పున జరిమానా విధించిచారు.

Last Updated : Apr 1, 2021, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details