ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలి' - ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలి

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపాలని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలోని అన్ని రహదారుల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రతరమైందని పరిష్కార మార్గం చూపాలని కోరారు.

'ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలి'
'ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలి'

By

Published : Jul 28, 2020, 8:53 AM IST

కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో లాక్​డౌన్ విధించటం సరైన నిర్ణయమని సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు వ్యాఖ్యానించారు. అలాగే పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు కూడా తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పట్టణ మెయిన్ రోడ్డుతో పాటు అన్ని రహదారుల్లో వాహనాల రద్దీ పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొండయ్యపాలెం వంతెన పూర్తి కాకపోవటం..., జగన్నాథపురం ఉప్పుటేరుపై మూడవ వంతన లేకపోవటంతో నగర ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తీవ్రతరమయ్యాయని పేర్కొన్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దృష్టిసారించి ప్రజల అవస్థలు తీర్చాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details