ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఎదురుగా ఢీకొన్న ప్రమాదంలో తల్లితో పాటు 28 రోజుల పసికందు మృతి చెందింది. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం ఎన్.ఎస్ వెంకటనగరం గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఎన్ఎస్ వెంకటనగరం గ్రామానికి చెందిన వరలక్ష్మి.. తన 28 రోజుల బిడ్డతో కలిసి చీడికలోని తన అమ్మవాళ్ల ఇంటి నుంచి అత్తగారి ఇంటికి వెళ్తోంది. తమ్ముడి ద్విచక్రవాహంపై ఎన్ఎస్ వెంకటనగరంలోని అత్తగారింటికి సమీపంలోకి రాగానే మట్టి ట్రాక్టర్ ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరలక్షి, ఆమె బిడ్డ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యుల రోదనలతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ట్రాక్టర్ ఢీ... తల్లి, 28 రోజుల పసికందు దుర్మరణం - mother,child dead at east godavari district
ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొని తల్లి, 28 రోజుల పసికందు మృతి చెందిన హృదయవిదారక ఘటన తూర్పు గోదావరి జిల్లా ఎస్.ఎస్ వెంకటనగరంలో జరిగింది. కొద్ది సెకన్లలో ఇంటికి చేరుకుంటామనుకునేలోగా ఈ ప్రమాదం జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ట్రాక్టర్ ఢీకొని తల్లి, ఇరవై రోజుల పసికందు మృతి