స్టెప్నితెచ్చిన తంట.. నిండు ప్రాణం బలి - tractor accident driver dead gokavaram
ఓలారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. లారీ డ్రైవర్ స్టెప్నిని సరిగ్గా పెట్టుకోకపోవడంతో రోడ్డుపై పడ్డ టైర్‌ను ఢీకొని ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో రోడ్డుపై పడిన స్టెప్ని టైర్‌ను ఢీకొని ట్రాక్టర్ తిరగబడింది. ఈప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గోకవరం నుంచి మట్టిని తీసుకురావడానికి బయలుదేరిన ట్రాక్టర్... గంగాలమ్మ ఆలయం వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న క్వారీ లారీ స్టెప్ని టైర్ ప్రమాదవశాత్తు ఊడి పడింది. వెనుక వస్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా టైర్‌ను ఢీకొని ఆదుపు తప్పి తిరగబడింది. ట్రాక్టర్ కింద చిక్కుకున్న డ్రైవర్ శ్రీకాకుళపు అనంద్(28) అక్కడే మృతిచెందాడు.