earth quake: బంగాళాఖాతంలో భూకంపం..రాష్ట్రంలో పలుచోట్ల ప్రకంపనలు - Impact of earthquake in West Godavari district
13:36 August 24
Bay Bengal Earth Quake_Breaking: బంగాళాఖాతంలో భూకంపం
బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.1గా నమోదు అయినట్టు నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలుకు 257 కిలోమీటర్ల దూరంలో ని సముద్ర గర్భంలో ఈ భూకంపం నమోదు అయినట్టు తెలియజేసింది. సముద్ర గర్భం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రకం ఉన్నట్టు ఎన్జీఆర్ఐ తెలిపింది. కాకినాడ నుంచి ఆగ్నేయంగా 296 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రి నుంచి 312 కిలోమీటర్ల, పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురానికి 260 కిలోమీటర్ల దూరంలోను భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. 2 సెకన్ల పాటు భూ ప్రకంపనలు నమోదు అయినట్టు శాస్తవ్రేత్తలు వెల్లడించారు. ప్రకంపనల స్థాయి తక్కువగా ఉండటంతో ఎలాంటి సునామి హెచ్చరికలు జారీ చేయలేదు.
ఇదీ చదవండీ.. KRMB: ఈ నెల 27న జరగాల్సిన కేఆర్ఎంబీ భేటీ వాయిదా