కేంద్ర పాలిత యానంలో పుదుచ్చేరి పర్యాటకశాఖ సీగల్స్ బోట్ హౌస్ సిబ్బంది చేసిన ప్రయోగం ప్రశంసలను అందుకుంటోంది.తమ కార్యాలయంలో మొక్కలు పెంచేందుకు తీవ్ర నీటి ఎద్దడి ఉండటంతో,డ్రిప్ పద్దతిలో నీటి సరఫరా చేయాలని బావించారు.అందుకోసం బోటుషికారుకు వచ్చిన పర్యాటకులు వదిలేసిన శీతల పానీయ,మంచినీటి సీసాలను కత్తిరించి..వాటిమూతలకు సెలైన్ ట్యూబ్ లు అమర్చి మొక్కల మొదల్లో వేలాడదీసారు.సీసాను ఓ కర్రకు కట్టి అందులో నీరుపోస్తున్నారు.దాని ద్వారా నీరు చుక్క చుక్కలుగా మొక్కల మొదల్లోపడుతోంది. మొక్కకూడా తాజాగా పచ్చగా కనిపిస్తోంది.ఇలాచేయడంవలన మొక్కలకు ఎప్పుడూ నీరుఅందటంతోపాటు మూడురోజులకు ఒకసారి సీసా లోనీరుపోస్తే సరిపోతుందని సీగల్స్ మేనేజర్ మురళి తెలిపారు.రోడ్డు పక్కన ఈ సీసాలను చూసినవారంతా వీరి ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.ఇంటివద్ద కూడా మొక్కలకు ఇలాచేస్తే నీరు వృథా కాదంటున్నారు.
ఔరా..! అనిపించే ఐడియా ఇది..! - tourisum seagals boat house members
ఒక్క ఐడియా, రూపురేకల్ని మార్చేస్తుందంటారు. సరిగ్గా అలాంటి ఉపాయంతో పుదుచ్చేరి పర్యాటక సీగల్స్ బోట్ హౌజ్ సిబ్బంది చేసిన ప్రయోగం, చూపరులను ఔరా..! అనిపిస్తోంది.
![ఔరా..! అనిపించే ఐడియా ఇది..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4446684-987-4446684-1568539233349.jpg)
వ్యర్థాలతో వినూత్న ఐడియాలు...చేస్తోన్న పుదుచ్చేరి పర్యాటకశాఖ సీగల్స్ బోట్ హౌస్ సిబ్బంది.