ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానంలో పర్యాటకుల సందడి

కరోనా లాక్​డౌన్​ నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు బయటకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పర్యాటకం తెరుచుకున్నప్పటికీ.. కేంద్రపాలిత ప్రాంతమైన యానం ప్రభుత్వం గత నెలలోనే అనుమతులు జారీ చేసింది. కార్తికమాసం అయినా కూడా కరోనా భయంతో పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు జనం ఆసక్తి చూపలేదు. కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం ఇప్పుడిప్పుడే ప్రజలు బయటకు వస్తున్నారు. దీంతో యానంలో పలు ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.

By

Published : Dec 7, 2020, 8:23 AM IST

tourists in Yanam
యానంలో పర్యాటకుల సందడి


కార్తిక మాసంలోని వనభోజనాలతో తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడుతుండేవి. తూర్పు గోదావరి జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కేంద్రం పాలిత యానాం మరింత సందడిగా ఉండేది. కరోనా భయంతో పెద్దగా ప్రజలు బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. పుదుచ్ఛేరి ప్రభుత్వం నవంబర్ నుంచే లాక్​డౌన్​ ఆంక్షలను తొలగించి.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పర్యాటకులకు అనుమతులు ఇచ్చింది. అయినప్పటికీ పెద్దగా జనం బయటకు రాలేదు. కార్తీకమాసం దాదాపుగా ముగింపుకొస్తుండటం.. గౌతమి గోదావరి తీరంలో సందడి నెలకొంది. శివంబాత్, రాజీవ్ బీచ్ లోను సెల్ఫీ దిగుతూ.. బోటు షికారు చేస్తూ.. సాయం సంధ్య వేళ చల్లగాలిని ఆస్వాదిస్తున్నారు. పర్యాటకులకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details