ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 4, 2019, 11:47 AM IST

ETV Bharat / state

సత్యదేవుని వ్రతం ఆచరించిన తాబేలు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి  దేవస్థానంలో ఒక తాబేలు వ్రతం చేసింది. ఇక్కడే కాదు ఏ వ్రతం అయినా చక్కగా కుర్చొని వింటుంది. చికెన్, మటన్, ఇడ్లీ, దోశ ఇలా మానవులు తినే పదార్థాలు అన్నీ తింటుంది. మరి ఈ కూర్మం గురించి మనమూ తెలుసుకుందామా..!

tortoise done puja in annavaram temple
సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన తాబేలు

సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన తాబేలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన భాస్కరరావు, శివకుమారిలకు 10 సంవత్సరాల క్రితం ఒక తాబేలు దొరికింది. వరలక్ష్మీ వ్రతం రోజు దొరికిందని అదృష్టంగా భావించి దానికి ముద్దుగా 'మోటో' అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. వారి ఇంట్లో ఒక మనిషిలా కలిసిపోయింది. తాము ఎక్కడికెళ్లినా తాబేలును వెంట తీసుకెళ్తామని కుటుంబసభ్యులు తెలిపారు. అలాగే అన్నవరం తీసుకొచ్చి తమతో పాటు వ్రతం చేయించారు ఈ దంపతులు. ఎంతో బుద్ధిగా కూర్చొని బుద్ధిగా కథ ఆలకించి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించింది ఈ కూర్మం.

మాంసాహారం అంటే ఇష్టం

తాబేలు మోటోకి చికెన్​, మటన్​, ఇడ్లీ, దోశ అంటే చాలా ఇష్టమని పెంపకందారు భాస్కరరావు తెలిపారు. ఆదివారం వస్తే తనతో పాటే తిరుగుతుందని చెప్పారు. తన భార్య, పిల్లలకు ఈ మోటోతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని పేర్కొన్నారు.ఒక కూర్మం నిజంగా ఇలా కుటుంబంతో బంధం ఏర్పరుచుకోవడం నిజంగా ఆశ్చర్యేమే కదూ..!

ఇదీ చూడండి:

నేల తవ్వితే గుడ్లు వస్తాయ్‌!

ABOUT THE AUTHOR

...view details