తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో దివిస్ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల దాదాపు నలభై గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడతారని రైతులు అంటున్నారు. తమకు మద్దతివ్వాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులను విశాఖలో కలిసి కోరారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లామని.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదని వాపోయారు. గతంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు హామీ ఇచ్చిన వైకాపా.. అధికారంలోకి వచ్చాక తమకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
'తొండంగి గ్రామస్థులకు జనసేన అండగా ఉంటుంది' - divis industry construction news
తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో దివిస్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తక్షణమే ఆపాలంటూ స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణలను కలిసి తమకు మద్దతివ్వాలని కోరారు.
!['తొండంగి గ్రామస్థులకు జనసేన అండగా ఉంటుంది' tondagi farmers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9853519-299-9853519-1607770676536.jpg)
జనసేన నాయకులను కలిసిన తొండంగి రైతులు
ఈ ఫ్యాక్టరీ వస్తే రైతుల జీవనాధారం ప్రశ్నార్థకంగా మారుతుందని తమ గోడును వెలిబుచ్చుకున్నారు. పచ్చని పొలాలు ఉన్న తొండంగిలో ప్రభుత్వం కారుచిచ్చు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివిస్ పరిశ్రమ వల్ల పర్యావరణం, ప్రజల జీవనాధారం, మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటాయని జనసేన నేత శివశంకర్ అన్నారు. ధనం, అధికార బలంతో వైకాపా వ్యహహరిస్తుందని మండిపడ్డారు. గ్రామ ప్రజలకు, రైతులకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి:అగ్నికి వరి కుప్ప ఆహుతి.. రూ. లక్షన్నర నష్టం