ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల 25 వరకు కాలువలకు సాగు నీరు - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లాలోని రబీ సాగుకు కాలువల ద్వారా ఈ నెల 25 వ తేదీ వరకు సాగునీరు సరఫరా చేసేందుకు అధికారులు నిర్ణయించారు.

time extended for giving water to rabi crops in east godavari district
తూర్పుగోదావరి జిల్లాలో కాలువలకు సాగు నీరు ఇచ్చేందుకు తేదీ పొడిగింపు

By

Published : Apr 15, 2020, 11:11 AM IST

తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల 25 వరకు రబీ సాగుకు కాలువల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ నెల 15 వరకు సాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. అయితే జిల్లాలో సాగునీరు అందక రైతులు ఇబ్బందు పడుతున్నందున మరిన్ని రోజులు నీటి విడుదలకు నిర్ణయించినట్టు జల వనరుల శాఖ సూపరింటెండెంట్​ ఇంజనీర్​ కె. ఎస్​. ప్రకాష్​రావు వెల్లడించారు.

జిల్లాలో 1.64 వేల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తుండగా... 45 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఇప్పటికే కోతలు పూర్తయ్యాయి. మరో 69 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి పొలాలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఇక మిగిలిన 50 వేల హెక్టార్ల విస్తీర్ణంలోని ఆయకట్టుకు ఇంకా సాగు నీరు అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25 వరకు పంట కాలువల ద్వారా సాగునీరు అందించాలని అధికారులు నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details