ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్రహ్మోత్సవం... ఆరు తరాలు ఒకే చోట - ఆరు తరాలు 300 వందల మంది కుటుంబీకులు సంక్రాంతి సంబరాలు

తల్లిదండ్రులు ఏమో... ఒకచోట.. పిల్లలేమో ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రం, దేశములో స్థిరపడే రోజులువి. అలాంటింది ఏదైనా వేడుకలు జరుపుకున్నా....అంత దూరం నుంచి రావటం కుదరదు. అయితే తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామంలో ఏకంగా... ఆరుతరాల వారు ఒకే చోట కలుసుకున్నారు. ఆ వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..

threehundered-familyies-sankranti-dresscode
మేమంతా.... ఒకే కుటుంబం

By

Published : Jan 16, 2020, 11:49 PM IST

మేమేంతా.... ఒకే కుటుంబం

ప్రసుత్త రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఓ చోట కలుసుకోవాలంటేనే సాధ్యపడని కాలమిది. అలాంటిది ఏకంగా ఆరు తరాలకు చెందిన 300 మంది కుటుంబీకులు ఒకే చోట చేరటం ఆశ్చర్యమే.. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో నాగుల్ లంక గ్రామం ఉంది. ఇక్కడ లక్కిం శెట్టి కుటుంబం కొన్ని తరాలుగా నివాసం ఉంటున్నారు. వీరంతా ఉద్యోగాల రీత్యా... వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. సంక్రాంతి పండుగ కోసం.. ఏకంగా 6 తరాలకు చెందిన మూడు వందల మంది కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలారు. ముగ్గులు, గొబ్బెమ్మలు, వంటలు, ఆటలు ఆనందంగా గడిపారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే... అందరూ ఏకరూప దుస్తులు ధరించటం గొప్ప విశేషం. ఇందుకు కారణం... ఈనాడు సండే మ్యాగ్​జైన్లో నీలం రంగు గురించి కథనం చదివి.. దాని స్ఫూర్తిగా... చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరు సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు ఒకే రంగు దుస్తులు ధరించారు. వారి అమ్మమ్మ ఇంట్లో...ఆటపాటలతో సందడి చేశారు.

ABOUT THE AUTHOR

...view details