తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని రథంగుడి ఆవరణలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ఉన్న హుండీలోని డబ్బు చోరీకి గురైంది. ఆదివారం రాత్రి వరకు బాగానే ఉన్న హుండీ ఇవాళ ఉదయానికి ధ్వంసమై కనిపించింది. దీంతో ఆంజనేయస్వామి విగ్రహ నిర్వహణ కమిటీ సభ్యులు మండపేట టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబ్బందితో కలిసి సీఐ అడపా నాగ మురళీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మండపేటలోని రథంగుడిలో చోరీ - తూర్పుగోదావరి జిల్లా క్రైం న్యూస్
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రథంగుడి ఆవరణలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ఉన్న హుండీలోని డబ్బును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
![మండపేటలోని రథంగుడిలో చోరీ three unknown persons theft hundi in front of hanuman status at rathaudi maddapet in east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8887217-1022-8887217-1600708882231.jpg)
మండపేటలోని రథంగుడిలోని హుండీలో చోరీ
మండపేటలోని రథంగుడిలోని హుండీలో చోరీ
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ పుటేజీని పరిశీలించగా ముగ్గురు యువకులు మోటారు సైకిల్‌పై వచ్చి హుండీలో సొమ్ము దొంగిలించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీని ఆధారంగా నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు.