ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రివర్గ కూర్పులో జిల్లా నుంచి ముగ్గురు - కురసాల కన్నబాబు

మంత్రివర్గ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. ముఖ్యమంత్రి జగన్‌ తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. సీనియర్లకు అవకాశమిచ్చారు. పార్టీకి విధేయులుగా ఉన్న వారికి మంత్రివర్గ కూర్పులో చోటు దక్కింది.

జగన్‌ మంత్రివర్గం

By

Published : Jun 8, 2019, 6:41 AM IST

జిల్లా నుంచి సీనియర్ నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ జగన్‌ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న ఈయనకు జగన్... తన జట్టులో చోటు కల్పించారు. సౌమ్యుడు, వివాద రహితుడిగా పేరున్న సుభాష్ చంద్రబోస్‌... వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆంతరంగిక అనుచరుడు. బీఎస్సీ పూర్తి చేసిన సుభాష్ చంద్రబోస్‌... 1978లో జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడిగా పనిచేశారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా రామచంద్రాపురం నుంచి ఎన్నికయ్యారు. 2004లో గెలిచి... వైఎస్సార్ హయాంలో మంత్రిగా పనిచేశారు. 2009 గెలుపొంది... 2012వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 2012 ఉపఎన్నికలో ఓడిపోయారు.

పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
నియోజకవర్గం:మండపేట
వయస్సు: 69
విద్యార్హత:బీఎస్సీ
రాజకీయ అనుభవం:మూడుసార్లు ఎమ్మెల్యే, వైఎస్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు.

అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పినిపె విశ్వరూప్‌... బీఎస్సీ, బీఈడీ చదివారు. 1987లో రాజకీయ ప్రవేశం చేసిన విశ్వరూప్... 2004లో తొలిసారి ముమ్మడివరం నుంచి ఎన్నికయ్యారు. 2009లో అమలాపురం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2009 నుంచి 2010 వరకు గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రిగా పనిచేశారు. 2010 నుంచి 2013 వరకు పశుసంవర్ధకశాఖ, పాడిపరిశ్రమ, మత్స్య, శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2014లో వైకాపాలో చేరారు.

పినిపె విశ్వరూప్‌
నియోజకవర్గం:అమలాపురం
వయస్సు:55
విద్యార్హత:బీఎస్సీ, బీఈడీ
రాజకీయ అనుభవం:రెండు సార్లు ఎమ్మెల్యే. వైఎస్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.

కాకినాడ గ్రామీణం నుంచి గెలుపొందిన కురసాల కన్నబాబు... జగన్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఎంఏ చదివిన కన్నబాబు... జర్నలిస్ట్‌గా పని చేశారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2014 తర్వాత వైకాపాలో చేరి... తాజాఎన్నికల్లో కాకినాడ గ్రామీణం నుంచి గెలుపొందారు.

కురసాల కన్నబాబు
నియోజకవర్గం:కాకినాడ రూరల్‌
వయస్సు:46
విద్యార్హత:ఎంఏ
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రజారాజ్యంలో కీలక నేతగా పనిచేశారు.

ABOUT THE AUTHOR

...view details