లాక్డౌన్ సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం వచ్చిన 3 లారీలతో పాటు ప్రభుత్వ విధులకు వాడకంలో ఉన్న ఓ కారును.. మండల తహసీల్దార్ స్వాధీనం చేసుకున్నారు. వీటిని పోలీసులకు అప్పగించారు. లంక భూముల నుంచి ఇసుక తరలించేందుకు వాహనాలు వచ్చాయని స్థానికులు అంచించిన సమాచారం మేరకు తహసీల్దార్ బి. మృత్యుంజయరావు అప్రమత్తమయ్యారు. కారులో ఉన్న వ్యక్తులు పొంతన లేని సమాధానాలు చెప్పడంగా.. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది గమనించి ఓ కారును డ్రైవర్ వెంటనే తీసుకెళ్లినట్టు గుర్తించారు. మిగిలన కారుతో పాటు, 3 లారీలను పట్టుకున్నారు. విచారణ చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని అమలాపురం ఆర్డీవో భవాని శంకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
ఇసుక తరలింపు యత్నాన్ని అడ్డుకున్న పోలీసులు - మూడు లారీలు ఓ కారును స్వాధీనం చేసుకున్న పి. గన్నవరం తహసీల్దార్
లాక్డౌన్ సమయంలో ఇసుక తరలించేందుకు వచ్చిన 3 ఖాళీ లారీలు, ఒక కారును పి.గన్నవరం తహసీల్దార్ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.
![ఇసుక తరలింపు యత్నాన్ని అడ్డుకున్న పోలీసులు three lorries and a car seized by thsildar in p.gannavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6797008-612-6797008-1586925924711.jpg)
వాహనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు