కరోనా కేసులు పెరుగుతున్నా..కనిపించని భౌతిక దూరం - though corona cases increases no physical distance
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయినా కొంతమంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ కరోనా వ్యాప్తి కారణమవుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయినా ఇంకా కొంతమంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్న తీరు రావులపాలెంలో చోటు చేసుకుంది. ఉదయం 6 నుంచి 11గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అధికారులు అనుమతి ఇవ్వడంతో వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రజలు రావులపాలెం వస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని పదేపదే అధికారులు చెబుతున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దుకాణాల్లో సైతం భౌతిక దూరం పాటించకుండా పదుల సంఖ్యలో ఉంటున్నారు. ఇప్పటికైనా ప్రజలు నిర్లక్ష్యం వీడి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి : నిత్యావసర వస్తువుల దుకాణాల జాబితాలో మద్యం దుకాణాలు..!