కరోనా వైరస్ వ్యాపించకుండా సామాజిక దూరం పాటించాలని అధికారులు, పోలీసులు ఎంత చెబుతున్నా చాలామంది పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజిపేట అరటి మార్కెట్లో వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గుంపులు గుంపులుగా చేరి సామాజిక దూరం లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. చాలామంది ముఖాలకు మాస్కులు అడ్డుపెట్టుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇలా చేస్తే వైరస్ నియంత్రణ ఎలా సాధ్యపడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా చేస్తే వైరస్ నియంత్రణ సాధ్యమేనా..? - తూర్పుగోదావరిలో కరోనా కేసులు
కరోనా నియంత్రణ కోసం చేపట్టాల్సిన సామాజిక దూరం లక్ష్యానికి పలువురు తూట్లు పొడుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలు గుంపులు గుంపులుగా చేరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైరస్ నియంత్రణ ఎలా సాధ్యమవుతుంది