ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైలు నుంచి జారిపడి హిజ్రా మృతి - train accident

రైలు నుంచి జారిపడి హిజ్రా మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. మరో హిజ్రాకు స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

రైలు నుంచి జారిపడి హిజ్రా మృతి

By

Published : Jul 21, 2019, 7:14 PM IST

రైలు నుంచి జారిపడి హిజ్రా మృతి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి విశాఖ వెళ్తున్న ఓ రైలు నుంచి సత్య అనే హిజ్రా జారిపడి మృతి చెందింది. మరో హిజ్రా స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయట పడింది. మృతి చెందిన హిజ్రాది రాయవరం మండలం మాచవరం గ్రామంగా గుర్తించారు. శరీరం రెండు ముక్కలవటంతో ప్రమాదంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైలు నుంచి జారీ పడ్డారా ? లేక మరేదైనా కారణమా ? అన్న కోణంలో విచారణ చేపట్టారు. గాయపడిన హిజ్రాను అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details