ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ బిందెలు మీ ఇంట్లో ఉంటే కోటీశ్వరులైపోతారు! - east godavari

ఆ బిందెలు మీ ఇంట్లో ఉంటే చాలు రాత్రికి రాత్రే కోటీశ్వర్లైపోవచ్చు. ఆ బిందెలకు అంతా పవర్ ఉందా అని ఆశ్చర్యపోకండి ! ఎందుకంటే వాటికి సాక్షాత్తు భారత ప్రదాని మోదీ తోపాటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ఆర్కియాలజీ శాఖ , రిజర్వ్​బ్యాంకు అనుమతులు కూడా ఉన్నాయి. ఆ బిందెలు కనుక మీ వద్ద ఉంటే మీరు ఉహించని విధంగా 500 కోట్లు కంటైనర్​లో మీ ఇంటికి వచ్చి చేరుతుంది మరీ ! అదెలా అని ఆలోచిస్తున్నారా...అయితే ఈ స్టోరీ చదవండి మీకే తెలుస్తుంది.

ఘరానా దొంగ

By

Published : Jul 30, 2019, 5:26 PM IST

ఘరానా దొంగ పోలీసులకు చిక్కాడిలా...

తూర్పుగోదావరి జిల్లా పెదపూడికి చెందిన షేక్‌ సర్ధార్‌ హుస్సేన్‌ కాపర్, ఇరిడియం బిందెలను తయారు చేశాడు. వాటిని కనుక మీ ఇంట్లో ఉంచితే రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావచ్చని 15 మందికి ఆశ చూపించాడు. వారిని బోల్తా కొట్టించడానికి ఆ బిందెలకు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ఆర్కియాలజీ శాఖ అనుమతులు ఉన్నట్లు నమ్మించాడు. రిజర్వ్​ బ్యాంక్ , ప్రధాని మోదీ పేర్లతో నకిలీ లెటర్​హెడ్​లను సృష్టించాడు. వాటిని వారికి చూపించడంతో నింజగానే రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావచ్చని బాధితులు ఆశపడ్డారు.దాదాపు 30 లక్షలు నిందితుడికి ముట్టజెప్పారు. బాధితులు కోటీశ్వర్లు కాకపోగా... 500 కోట్ల డబ్బు కంటైనర్ల ద్వారా రిజర్వ్​ బ్యాంకు నుంచి వస్తుందని మరోసారి మోసానికి పాల్పడుతూ సర్పవరం పోలీసులకు చిక్కాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాలోచన ఉన్న ప్రజలే లక్ష్యంగా... సరికొత్త మోసానికి తెరలేపిన నిందితుడు చివరకు కటకటాల పాలయ్యాడు.

ABOUT THE AUTHOR

...view details