ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నకిలీ కూపన్లతో ఇసుక తరలిస్తున్నారు' - రంపచోడవరం నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక తరలింపు

నకిలీ కూపన్లతో గిరిజన ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం బొంగరాలపాడులో అధికార పార్టీ నేతలు ఇసుక దందా చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

They are moving the sand illegally with fake coupons at rampachodavaram constituency
తెదేపా మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి

By

Published : Feb 18, 2020, 6:46 PM IST

తెదేపా మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం బొంగరాలపాడులో అధికారపార్టీ ఇసుకదందా చేస్తోందని తెదేపా మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. నకిలీ కూపన్లతో గిరిజన ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని మండిపడ్డారు. ఈనెల 10వ తేదీన ఇసుక రీచ్​లలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుని... 30 ఇసుక ట్రాక్టర్లను పోలీసులకు అప్పగించామని గుర్తుచేశారు. ఇసుక మాఫియాతో స్థానిక అధికార, పోలీసు యంత్రాంగం కుమ్మక్కయ్యారని ఆమె ఆరోపించారు. ఎస్సై నాగేశ్వరరావు, సీఐ రవికుమార్ , రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఇసుక దందాకు సహకరిస్తున్నారని రాజేశ్వరి వెల్లడించారు. అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న తనపై పోలీసులు అట్రాసిటీ, కిడ్నాప్ కేసులు పెట్టారన్నారు. గిరిజనులైన తాము పెట్టాల్సిన అట్రాసిటీ కేసును తమపైనే పెడతారా అంటూ నిలదీసిన ఆమె... దీనిపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details