వేసవిలో రహదారికి 'అగ్నిపూల' అందాలు - kothapeta
తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట నియోజకవర్గంలోని రోడ్లపై, మూలస్థానం- జొన్నాడ జాతీయ రహదారిపై ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. శీతాకాలంలో అన్ని చెట్ల వలె పచ్చదనంతో ఉన్నా... వేసవిలో ఆకులురాలి పుష్పాలు మాత్రమే పూస్తాయి.
వేసవి వచ్చిందంటే చెట్టుకుండే ఆకులు ఎండి రాలిపోయి కళావిహీనంగా దర్శనమిస్తాయి. చెట్టుకున్న పుష్పాలు సైతం ఎండవేడిమికి వాలిపోతాయి. కానీ ఎంత ఉష్ణోగ్రత ఉంటే అంతే విధంగా పువ్వులు విరబూస్తూ చూపరులకు కనువిందు చేస్తున్నాయి అగ్ని పూల చెట్లు.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఊబలంక - బొబ్బర్లంక వెళ్లే దారిలో, అమలాపురం రహదారిపై, గంటి పెదపూడి రోడ్లపై, మూలస్థానం - జొన్నాడ జాతీయ రహదారిపై ఈ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. శీతాకాలంలో అన్ని చెట్ల వలె పచ్చదనంతో నిండిపోయి ఉన్నా... వేసవి వచ్చే సరికి ఆకులు రాలి పోయి కేవలం పుష్పాలు మాత్రమే వస్తాయి. చూపురులను కనువిందు చేసే విధంగా ఎరుపు రంగులో ఉంటాయి. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రతకు మరింతగా వికసిస్తాయి. రహదారి వెంబడి వెళ్ళే ప్రయాణికులను ఈ పుష్పాలు కన్నులకు కనువిందు చేస్తాయి.