మోదుకూరులోని ఓ ఇంట్లో వెండి వస్తువుల చోరీ...కేసు నమోదు - eastgodavari news
ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి వెండి వస్తువులను అపహరించుకుపోయిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా మోదుకూరులో జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా మోదుకూరుకు చెందిన యడ్లపల్లి రవీంద్రనాథ్ రాజమహేంద్రవరంలోని ఓ నిర్మాణ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు. 45 రోజులుగా కుటుంబ సభ్యులంతా రాజమహేంద్రవరంలోనే ఉంటున్నారు. ఆదివారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో... అతని సోదరుడు సత్యనారాయణ చూసి రవీంద్రనాథ్‌కు సమాచారం అందించాడు. రవీంద్రనాథ్ ఇంటికి వచ్చి చూడగా బీరువాలో ఉండవలసిన 4.9 కిలోల వెండి వస్తువులు కనిపించలేదు. గుర్తుతెలియని దొంగలు అపహరించినట్లు గుర్తించి.... ఆలమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి:శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత