తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని కూనవరం, పెద్దమంద గ్రామాల్లో ఆంజనేయ స్వామి, కనకదుర్గమ్మ ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు రెండు ఆలయాల్లోని హుండీలను బద్దలుకొట్టి డబ్బులను అపహరించుకుపోయారు.
ఆ సమయంలో స్థానికులు కేకలు వేయగా... దొంగలు ద్విచక్ర వాహనాన్ని వదిలేసి పారిపోయారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై కృష్ణమాచారి సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు.