ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాటిపాక కూడలిలో పది దుకాణాలలో వరుస చోరీలు - తాటిపాకలో పది దుకాణాలలో దొంగతనం

తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక కూడలిలో పది దుకాణాలలో చోరీలు జరిగాయి. ఒకే వీధిలో వరుస దొంగతనాలు జరగడంతో..స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

theft in  ten shops at Tatipaka
పది దుకాణాలలో దొంగతనం

By

Published : Apr 14, 2021, 2:23 PM IST

తూర్పుగోదావరిజిల్లా రాజోలు మండలం తాటిపాక కూడలిలోని దుకాణాలలో దుండగులు అర్ధరాత్రి వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. వీటిలో ఎనిమిది మెడికల్ దుకాణాలు, రెండు వస్త్ర దుకాణాలున్నాయి. డైలీ మార్కెట్​లో కిరాణా షాపు చోరీకి యత్నించి.. విఫలమయ్యారు. పెద్ద ఎత్తున నగదు, సరుకు చోరీకి గురైందని దుకాణాదారులు చెబుతున్నారు. వరుస దోపిడీలతో దుకాణదారులు ఆందోళన చెందుతున్నారు. రాజోలు సీఐ దుర్గా శేఖర్ రెడ్డి, ఎస్సై కృష్ణమాచారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details