తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని మందుల దుకాణాల్లో దొంగలు హల్ చల్ చేశారు. కర్ఫ్యూ వల్ల రింగ్ రోడ్ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడంతో శ్రీరామ మందుల దుకాణం తాళాలు పగలగొట్టి లక్ష రూపాయలను అపహరించుకుపోయారు.
పక్కనే ఉన్న మరో దుకాణం తాళాలు పగలగొట్టేందుకు విఫలయత్నం చేసి.. రాకపోవడంతో వెనుదిరిగారు. మందుల దుకాణం యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.