ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొమ్మిది దుకాణాల్లో దొంగతనాలు - పి.గన్నవరంలో తొమ్మిది దుకాణాల్లో చోరి

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. తొమ్మిది దుకాణాల్లో చోరికి పాల్పడి.. మరో మూడు దుకాణాల్లో దొంగతనానికి విఫలయత్నం చేశారు.. ఆ దుండగులు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో అర్థరాత్రి సమయంలో జరిగింది. పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.

theft in shops
theft in shops

By

Published : Apr 29, 2021, 9:49 AM IST


తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో.. 9 దుకాణాల్లో దొంగతనం జరిగింది. మరో మూడు దుకాణాల్లో చోరీకి విఫలయత్నం చేశారు. ప్రధాన కూడలి మొదలుకొని.. హై స్కూల్ కూడలి వరకు రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పి.గన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ జి.సురేంద్ర.. దొంగతనం జరిగిన దుకాణాలను పరిశీలించారు. దుండగులు అపహరించిన సొమ్ముల వివరాలను సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details